తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కర్ణాటక తరహా ఫార్మూలాను అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కర్ణాటక తరహా ఫార్మూలాను అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రజా కూటమికి ఏకపక్షంగా ప్రజలు తీర్పిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ దృష్టి కేంద్రీకరించనుంది. ఒకవేళ ఏ పార్టీకి కూడ పూర్తిస్థాయిలో మెజారిటీ రాకపోతే టీఆర్ఎస్‌‌ అధికారంలోకి రాకుండా అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యూహన్ని సిద్దం చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్‌తో సహా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ‌తదితరులు హైద్రాబాద్‌కు రానున్నారు.ఇండిపెండెంట్ అభ్యర్థులపై కూడ కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరిగాయి.మరికొద్ది గంటల్లో ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందుబాటులో ఉండనున్నారు. 

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైద్రాబాద్‌కు చేరుకొన్నారు.అహ్మాద్‌పేటల్ సహా మరికొందరు సీనియర్లు కూడ హైద్రాబాద్‌లో ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్లాన్ ‌ను మార్చుకొనే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి హైద్రాబాద్‌లో అందుబాటులో ఉండనున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అనుసరించిన వ్యూహం తరహాలోనే తెలంగాణలో కూడ అదే రకమైన ఫార్మూలాను అనుసరించనున్నాయి.

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయ ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడ ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. 

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో సుమారు ఎనిమిది మందికి పైగా ఇండిపెండెంట్లు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల నేపథ్యంలో ఇప్పటికే నలుగురు ఇండిపెండెంట్లతో కాంగ్రెస్ పార్టీ టచ్‌లోకి వెళ్లింది. 

జలంధర్ రెడ్డి, రాములు నాయక్, శివకుమార్ రెడ్డితో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థితో చర్చించారు. ఈ నలుగురిని కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాంప్‌కు పంపే అవకాశం ఉంది.ఎంఐఎం నేతలతో కూడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడ ఎంఐఎం నేతలతో టచ్‌లోకి వెళ్లారు.

సంబంధిత వార్తలు

గవర్నర్‌తో ప్రజా కూటమి నేతల భేటీ