Asianet News TeluguAsianet News Telugu

సబితా ఇంద్రారెడ్డికి కీలక బాధ్యతలు... కాంగ్రెస్ అధిష్టానం చర్చలు

తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీలో కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు అందుకోసం మొదట కీలక పదవుల్లో మార్పులు చేపట్టడానికి రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని రంగారెడ్డి జిల్లాలో కాస్త అడ్డుకున్న సబితా ఇంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 
 
congress party plan to give clp post sabitha indra reddy
Author
Hyderabad, First Published Dec 14, 2018, 3:25 PM IST

తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీలో కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు అందుకోసం మొదట కీలక పదవుల్లో మార్పులు చేపట్టడానికి రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని రంగారెడ్డి జిల్లాలో కాస్త అడ్డుకున్న సబితా ఇంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుండి తాను గెలుపొందడంతో పాటు మరో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలతో సబితా సఫలమయ్యారు. దీంతో ఆమెను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకు ఇటీవలే గెలిచిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అదష్టానానికి సబితకు అనుకూలంగానే తమ అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎల్పీ పదవి ఆమెనే వరిస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన తర్వాత సీనియర్ గా వున్న మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కూడా పార్టీ పదవిలో ఉన్నారు. వీరి తర్వాత సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి. అయితే ఆమెకు పార్టీ పదవులేవీ లేకపోవడంతో సీఎల్పీ భాద్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. 
  
Follow Us:
Download App:
  • android
  • ios