హైదరాబాద్: తెలంగాణమంత్రి మల్లారెడ్డి వ్యవహారం మున్సిపల్ ఎన్నికల్లో వివాదాస్పదంగా మారింది. టికెట్ల కేటాయింపు సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఇప్పటికే తీవ్ర విమర్శలు మల్లారెడ్డి ఎదుర్కొంటున్నారు.

Also read:వివాదంలో మంత్రి మల్లారెడ్డి: టిక్కెట్ల కోసం డబ్బులు డిమాండ్, ఆడియో వైరల్

మంత్రి మల్లారెడ్డి  మున్సిపల్ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో  డబ్బులు తీసుకొన్నట్టుగా ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఆడియోల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

Also Read:మున్సిపల్ పోల్స్‌లో కానరాని లెఫ్ట్ అభ్యర్థులు

తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు కార్పొరేషన్ల మున్సిపాల్టీల్లో టికెట్ల కేటాయింపుకు భారీగా ముడుపులు డిమాండ్ చేసినట్లు టికెట్ల కోసం పోటీ పడిన పలువురు నేతలు ఆరోపణలు చేశారు. 

Also Read:కేసీఆర్ పై ఫైట్: తెలంగాణలోనూ బిజెపి ఆస్త్రం పవన్ కల్యాణ్

ఈ నేపథ్యంలో ఆయన ఆడియోలు బయటకు రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల క్రితం ఆయన ఫోన్లో మాట్లాడిన మాటలు వైరల్ కావడంతో అధికార పార్టీలో కలకలం రేగింది. 

తాజాగా ఆయన కొడుకు, అల్లుడు మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అభ్యర్థులు ఎవరైనా విజయమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీ హైకమాండ్ సమర్థిస్తుందని  టికెట్ కావాలంటే కచ్చితంగా తమను ముందే కలుసుకోవాలని ఆడియో టెంపుల్లో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారాలన్నీ మంత్రి కొడుకు భద్రారెడ్డి చూస్తారని మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అభ్యర్థులతో అన్నట్లు వినిపిస్తోంది.