దళితబంధులో కమీషన్లు నొక్కిన ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ టికెట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవినీతిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో వుందని ఉత్తమ్ ఆరోపించారు. తాము 70 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌పై మండిపడ్డారు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. అవినీతిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో వుందని ఉత్తమ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీకి అలవాటుపడి ప్రజలను హింసిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ జాబితా దోపిడీదారులకు కేసీఆర్ వత్తాసు పలికినట్లుగా వుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దళితబంధులో కమీషన్లు నొక్కిన ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ టికెట్లు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. తాము 70 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇకపోతే.. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థులు జాబితాను ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు. ఈక్రమంలోనే ఆయన గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్.. గజ్వేల్ ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని అన్నారు. అయితే, కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓటమి తప్పదనీ, కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఈ స్థానం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు.
ALso Read: గజ్వేల్ లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ.. : కేసీఆర్ పై మహ్మద్ అలీ షబ్బీర్ ఫైర్
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో కామారెడ్డిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పనితీరు ప్రజలను నిరాశకు గురిచేసిందనీ, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయవద్దని ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే, కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించడం ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీసే ప్రయత్నమని ఆయన అన్నారు. గంప గోవర్ధన్ కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందనీ, వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గజ్వేల్, కామారెడ్డి రెండింటి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించడం చూస్తుంటే గంప గోవర్ధన్ వచ్చే ఎన్నికల్లో తనను ఓడించలేడని ఆయనకు తెలుసన్నారు. తనపై పోటీ చేయడం ద్వారా కేసీఆర్ కామారెడ్డి పుత్రుడిని టార్గెట్ చేయడమే కాకుండా ముస్లిం నాయకత్వంపై తనకున్న ద్వేషాన్ని చాటుకున్నారని అన్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తన ప్రస్తుత నియోజకవర్గం గజ్వేల్, కామారెడ్డితో సహా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
