Asianet News TeluguAsianet News Telugu

16 మంది సీఎంలకు అది సాధ్యం కాలేదనే... కేసీఆర్ ఈ ప్రయత్నాలు: రేవంత్ ఫైర్

కేసీఆర్ కు పిచ్చి ముదిరి పాకాన పడిందని... ఆయన ఆదేశాలతోనే సచివాలయంలో ప్రార్థనా మందిరాలు కూల్చి వేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Congress MP Revanth reddy Reacts on Secretariat demalition
Author
Hyderabad, First Published Jul 10, 2020, 6:44 PM IST

హైదరాబాద్: కేసీఆర్ కు పిచ్చి ముదిరి పాకాన పడిందని... ఆయన ఆదేశాలతోనే సచివాలయంలో ప్రార్థనా మందిరాలు కూల్చి వేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మత విశ్వాసాలకు విఘాతం కలిగేలా కేసీఆర్ వ్యవహరించారని మండిపడ్డారు. ఈ రోజు తెలంగాణకు బ్లాక్ డే అని రేవంత్ అన్నారు.    

''16 మంది సీఎంల కుమారులు ఎవరూ సీఎంలు కాలేదు అని వాస్తుపండితుడు చెప్పడంతోనే కేసీఆర్ సెక్రటేరియట్ కూల్చి వేతకు పూనుకున్నారు. ఇలా పాలకుల మూఢ నమ్మకాలతో రాష్ట్రానికి వందల, వేల కోట్ల భారం వేయకూడదు. సచివాలయం పై మేం ప్రజాప్రయోజన వాజ్యం వేశాం. కానీ మంత్రివర్గం నిర్ణయం తీసుకోలేదని కోర్టును తప్పుదోవ పట్టించారు'' అని అన్నారు. 

''మంత్రివర్గం నిర్ణయం తీసుకోకుండా కూల్చి వేత నిర్ణయం ఎలా చేశారు. పర్యావరణ శాఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కూల్చివేత జరుగుతోంది'' అని ఆరోపించారు. 

read more  సెక్రటేరియేట్‌లో ప్రార్థనా మందిరాలు దెబ్బతినడంపై కేసీఆర్ ప్రకటన: అసదుద్దీన్ స్పందన

''2008లో సెక్రటేరియట్ లో మజీదు నిర్మించారు. నల్ల పోచమ్మ దేవాలయం అనేక ఏళ్ల నుంచి ఉంది. ఒక మూర్ఖుడు ఆదేశాలు ఇస్తే సీఎస్, డీజీపీలు ప్రార్థనా మందిరాలు కూల్చి వేయించారు. దీనిపై బీజేపీ, ఎంఐఎం ఎందుకు నోరు మెదపడం లేదు. ఆ పార్టీల నాయకులు కేసీఆర్ ఇచ్చే ముడుపులకు కక్కుర్తి పడుతున్నారు'' అని విరుచుకుపడ్డారు. 

''దేశంలో హిందూ-ముస్లీం చావులకు బీజేపీ, ఎంఐఎంలే కారణం. సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల నాయకుల సొత్తా... వారి అబ్బజాగీరా.  గతంలో ట్రాఫిక్ సమస్య వల్ల ప్రార్థనా మందిరాలను కూల్చి వేస్తుంటే అసద్ వచ్చి రోడ్డు పై కూర్చున్నాడు. మరి సెక్రటేరియట్లో ప్రార్థనా మందిరాలు కూల్చేస్తే ఎందుకు నోరు మెదపరు?'' అని ప్రశ్నించారు. 

''సెక్రటేరియట్ మందిరాల విషయంలో మాత్రం మళ్లీ కట్టిస్తానన్నాడని కేసీఆర్ ను అసద్ మెచ్చుకుంటున్నారు.     బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అంతా ఒకటే గుంపు.  కూల్చివేత పై కేసు నమోదు చేసి కేసీఆర్, సీఎస్, డీజీపీలను జైలుకు పంపాలి'' అని రేవంత్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios