టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీ. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో వ‌ర‌ద స‌హాయంపై ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బ‌హిరంగ లేఖ రాశారు.

గ్రేటర్ లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ కుంభకోణానికి కారణంగా క‌న‌ప‌డుతుంద‌ని, చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారన్నారు.

మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చిందని, రెండు రోజుల్లో తిరిగి ప‌రిహారం పంపిణీ చేయాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన దోపిడిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల‌ని లేదంటే క్షేత్ర‌స్థాయి ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతామని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో వ‌ర‌ద స‌హాయాన్ని గులాబీ గ‌ద్ద‌లు స్వాహా చేశాయ‌ని ఆయన ఆరోపించారు. శ‌వాల‌పై పేలాలు ఏరుకున్న చందంగా వ‌ర‌ద బాధితుల స‌హాయంలోనూ క‌మీష‌న్లు దండుకున్నార‌ని రేవంత్ ఎద్దేవా చేశారు. మీ కార్పోరేట‌ర్లు, స్థానిక నాయ‌కుల‌ను చూస్తే వీళ్లు మ‌నుషులేనా , మాన‌వ‌త్వం ఉందా అనిపిస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.