కాంగ్రెస్ సీనియర్ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వీడిన వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో శనివారం నకరేకల్‌లో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరో వస్తున్నారనే వార్తలు నమ్మి కార్యకర్తలు అనవసరంగా ఆవేదన పడొద్దని వెంకట్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అక్కడ టికెట్ దొరక్కపోవడంతోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల సూచన మేరకే అభ్యర్ధిని నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: దళిత బంధు కింద రూ.12 లక్షలు.. పీజీ పాసైతే రూ. లక్ష సాయం : కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు

బీఆర్ఎస్ పాలనలో చాలామందికి రైతుబంధు అందలేదని.. కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదన్నర గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోందని వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా ఖరారవుతుందని.. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరపున అన్ని స్థానాలకు అభ్యర్ధులు వున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ నోరు జారితే తాను లాగ్ బుక్‌ను బయటపెట్టి నష్ట నివారణా చర్యలు చేపట్టానని చెప్పారు.