తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని డిల్లీకి పాదయాత్రగా వెళ్లిన రైతులపై బిజెపి ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ మండిపడ్డారు. అందుకు నిరసనగా ఆయన గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం దగ్గర నోటికి నల్ల  రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.  

అన్నదాతలపై బాష్ప వాయువులు ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. స్వామి నాథన్ కమీషన్ సిపార్సులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు.

రైతులపై ఎన్డీఏ ప్రభుత్వం చేయించిన దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు పొంగులేటి నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు.

ఈ ఘటనను ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకోవాలని...రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రధానిని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో పొంగులేటి తో పాటు నాయకులు గుండు నారాయణ రెడ్డి, మల్లు రమేష్, నిర్మల్ కుమార్ యాదవ్, వంజర మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు.