కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రాజెక్టులు ఎవ్వరూ కట్టలేదన్నట్లు కేసీఆర్ ఒక్కరే కట్టినట్లు  నానా హంగామా చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును పెద్దదిగా చూపించడమే తప్ప అక్కడ చేసిందేమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తే కేసీఆర్‌కు కమీషన్లు రావన్న భయంతో హోదా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.  

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ బాగోతం బయటపడాలంటే ఆ ప్రాజెక్టును కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటే అది సాధ్యమవుతుందన్నారు. విపక్షాలను కలుపుకుని ప్రాజెక్టుల బాట పట్టబోతున్నట్లు తెలిపారు. కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరిస్తామని తెలియజేశారు. బంగారు తెలంగాణ కాస్త లక్ష కోట్ల అప్పుల భారానికి చేరడానికి సీఎం కేసీఆరే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో జలదోపిడీ , అప్పుడు ఆంధ్రోళ్లు....ఇప్పుడు కేసీఆర్: సోమారపు ఫైర్