Asianet News TeluguAsianet News Telugu

45 రోజులుగా వీఆర్ఏ‌లు సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

తెలంగాణలో వీఆర్‌ఏలు న్యాయబద్దంగా సమ్మె చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. గత 45 రోజులుగా సమస్యల పరిష్కారించాలని కోరుతూ వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. 

Congress MLC Jeevan Reddy demand solve the VRAs Problems
Author
First Published Sep 7, 2022, 3:41 PM IST

తెలంగాణలో వీఆర్‌ఏలు న్యాయబద్దంగా సమ్మె చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. గత 45 రోజులుగా సమస్యల పరిష్కారించాలని కోరుతూ వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ఎటువంటి పురోగతి లేదన్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి అధికారుల వ్యవస్థ లేదని.. ఇది ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. 

వీఆర్ఏలు వారి సమస్యలు చెప్పుకోవటానికి మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లకుండా ముందుస్తు అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. వీఆర్‌ఏలు కోరుకునేది పేస్కేల్, ఆడవారికి ప్రసూతి సెలవులు అని చెప్పారు. మెటర్నిటీ లీవు లు లేని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆర్డర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ధిక్కరిస్తుందని అన్నారు. 

రెవెన్యూ శాఖలో ఉన్న వీఆర్వోలు అందరు లంచగొండిలు అని ప్రచారం చేస్తున్నారని.. వారి పైస్థాయిలో ఉన్న ఎమ్మార్వో, ఆర్డీవోలో లంచగొండితనం లేదా అని ప్రశ్నించారు. అక్రమ ఇసుక లారీలకు రాత్రి కావలి ఉన్న వీఆర్‌ఏలు ఎందరో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎవరి భూమి ఎవరు దున్నుకుంటున్నారో తెలియదని.. పహానిలు కూడా లేవని అన్నారు. 

Also Read: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

వీఆర్‌ఏలు ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న వారి గురించి ప్రభుత్వం మాట్లాడం లేదని మండిపడ్డారు. వీఆర్ఏలకు ప్రమోషన్ మీద, వారి అర్హత మీద జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించాలన్నారు. వీఆర్ఏ‌లకు వారసత్వ ఉద్యోగ ప్రక్రియ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల అశోక్ అనే వ్యక్తి మరణించాడని..  కానీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. కార్మికులకు చెల్లిస్తున్న వేతనం కూడా వీఆర్ఏ‌లకు ఇవ్వటం లేదన్నారు. స్వరాష్ట్రం వచ్చాక స్వాతంత్య్రం వస్తుంది అనుకుంటే.. మళ్ళీ బానిసత్వం వచ్చిందని అన్నారు. శాసనమండలిలో వీఆర్‌ఏల సమస్యలు మాట్లాడతానని హామీ ఇచ్చారు. వీఆర్‌ఏల ఉసురు తగిలి సీఎం‌కు తగులుతుందని అన్నారు.  తమ ప్రభుత్వం వచ్చాక వారి సమస్యలు పరిష్కారిస్తామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios