Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నేతలే ఢిల్లీ మద్యం స్కాంకు ఆద్యులు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే నాలుగు రెట్లు మద్యం రేట్లు ఎక్కువన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ మద్యం అమ్మకాల్లో ఎంత స్కాం జరిగిందోనంటూ జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

congress mlc jeevan reddy comments on delhi liquor policy scam
Author
Hyderabad, First Published Aug 23, 2022, 2:39 PM IST

తెలంగాణ నేతలే ఢిల్లీ మద్యం స్కాంకు ఆద్యులంటూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే నాలుగు రెట్లు మద్యం రేట్లు ఎక్కువన్నారు. తెలంగాణ మద్యం అమ్మకాల్లో ఎంత స్కాం జరిగిందోనంటూ జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫినిక్స్ యజమాని అక్రమాల పుట్ట అంటూ ఆరోపించారు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న వారిపై సీబీఐ తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మద్యం విధానం, తెలంగాణ మద్యం విధానం కూడా ఒక్కటేనని  మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.  ఢిల్లీలో హోటల్ లో లిక్కర్ పాలసీని రూపొందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాలసీలు కేబినెట్ లో నిర్ణయించాల్సి ఉందన్నారు. కానీ హోటల్ రూమ్ లోనే ఈ పాలసీని రూపొందించారని  భట్టి విక్రమార్క ఆరోపించారు. 

Also REad:ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ చేయించాలి:సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ విధానాన్ని ఢిల్లీలో అమలు చేసినందున ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగిందని చెబుతున్నారని భట్టి చెప్పారు. అదే నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద కుంభకోణం జరిగి ఉంటుందోనని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల ఎక్సైజ్ శాఖ నుండి ఆదాయం వచ్చేదని విక్రమార్క గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం రూ. 30 వేల కోట్లకు చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎనిమిది ఏళ్లుగా ఏ కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నారో చెప్పాలని మల్లు భట్టి విక్రమార్క కోరారు. మద్యం ధరలను నిర్ణయించే విషయంలో ఏ కమిటీలు నిర్ణయం తీసుకొన్నాయో చెప్పాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని  ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాజకీయ అవసరాల కోసం ఈడీ, సీబీఐలను ఉపయోగించుకోకుండా ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే అంశంపై ఈ సంస్థలతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బ్రేవరేజేస్ కార్పోరేషన్ లో ఎక్కువ కాలం పాటు ప్రస్తుత సీఎస్ సోమేష్ కుమార్ ఎక్కువ కాలం పాటు పనిచేశారని ఆయన గుర్తు చేశారు. మద్యం ధరల నిర్ణయించే సమయంలో ఏం జరిగిందో లోతుగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై మీడియాలో వస్తున్న కథనాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయాలపై టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios