Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన సీఎల్పీ భేటీ: గాంధీ విగ్రహాం ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా

టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహాం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
 

congress mlas protesting against trs in front of gandhi statue
Author
Hyderabad, First Published Mar 3, 2019, 2:43 PM IST


హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహాం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,  రేగా కాంతారావులు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయమై సీఎల్పీ  అత్యవసరంగా ఆదివారం నాడు అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగింది. 

సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే  ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు కేసీఆర్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై మరింత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

సంబంధిత వార్తలు

సీఎల్పీ భేటీ నుండి అర్ధాంతరంగా వెళ్లిన కోమటిరెడ్డి: నాయకత్వంపై విసుర్లు


 

Follow Us:
Download App:
  • android
  • ios