నా అనుచరులను కొనేశారు .. ఎన్నో ఇబ్బందులు పెట్టారు : బీఆర్ఎస్ నేతలపై సీతక్క విమర్శలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ములుగు అభ్యర్ధి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ, కుట్రలతో ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని.. ఆడబిడ్డ ఉసురు వారికి తగులుతుందని సీతక్క వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ములుగు అభ్యర్ధి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ, కుట్రలతో ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తన కార్యకర్తలను డబ్బులతో కొని.. తనపై తప్పుడు ప్రచారం చేయించారని సీతక్క ఆరోపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను ములుగు ప్రజల వెంటే వుంటానని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని.. ఆడబిడ్డ ఉసురు వారికి తగులుతుందని సీతక్క వ్యాఖ్యానించారు. చిన్నారులు కూడా తనను అక్కును చేర్చుకున్నారని.. తన గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read: Seethakka : ఫోటో వివాదం... అర్థరాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆందోళన
కాగా.. కొద్దిరోజుల క్రితం బ్యాలెట్ పేపర్‌లో తన ఫోటోను చిన్నగా ముద్రించారంటూ సీతక్క ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్థరాత్రి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు సీతక్క. సమాచారం అందుకున్న రిటర్నింగ్ అధికారి అంకిత్ సీతక్కతో మాట్లాడారు. నామినేషన్ సమయంలో ఇచ్చిన ఫోటో వల్లే ఇలా జరిగిందని... ఉద్దేశపూర్వకంగా చిన్నగా ముద్రించలేదని తెలిపారు. ఈవిఎం బ్యాలెట్ పత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరో ఫోటో ఇస్తే మారుస్తామని రిటర్నింగ్ అధికారి సీతక్కను సముదాయించారు.