కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి భవన్ ముట్టడికి నేతలు యత్నించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సితక్క  కిసాన్ కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పంటల బీమా కింద రైతులకు చెల్లించాల్సిన పరిహారం 500 కోట్లలను వెంటనే చెల్లించాలని కోరారు.

ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎమ్మెల్యే సితక్క తో పాటు కిసాన్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నిరసన తెలియజేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని.. అసెంబ్లీలో సైతం ప్రజా సమస్యలపై చర్చ జరగలేదన్నారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీతక్క ఆరోపించారు. 

 

"