టిఆర్ఎస్ కార్యకర్తలకే ముసుగేస్తున్నాడు కేసిఆర్ పెట్టుబడి రాయితీ వాయిదా వేసే కుట్ర

తెలంగాణలో రైతు సమన్వయ సమితిల ఏర్పాటుపై కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. టీఆరెస్ కార్యకర్తలకు కేసిఆర్ రైతు సమన్వయ సమితి ముసుగులు తొడుగుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న రెవెన్యూ సదస్సులు కొత్త కాదని, 1954 నుండి అనవాతిగా జరుతూనే ఉన్నాయని చెప్పారు.

ఊదరగొట్టే ప్రచారం తప్ప రైతు సమన్వయ సమితిలతో ఒరిగేదేమీ ఉండదని ఎద్దవే చేశారు. రైతులకు ఇస్తామన్న 4వేల పెట్టుబడి రాయితీని వాయిదా వేసే కుట్ర కనిపిస్తుందని ఆరోపించారు. ధరల స్థిరీకరణ కోసం మార్కెట్ ఇంటర్వ్బెన్షన్ కు 4 వందకోట్ల కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడీ వరకు 4 రూపాయలు కూడా ఖర్చు చేయలేదన్నారు.

.పౌల్ట్రీ రైతులకు రాయితీస్తున్న సర్కార్ కు మొక్క జొన్నకు బోనస్ ఇవ్వడానికి డబ్బులు లేవా? అని నిలదీశారు. రైతులపై ప్రేముంటే ఈ ఖరీఫ్ నుంచే రైతులకు 4వేల పెట్టుబడి రాయితీ ని అందించాలని డిమాండ్ చేశారు.

ఇక నల్లగొండ ఎమ్మెలయే కోమటిరెడ్డి వ్యాఖ్యలపైనా జీవన్ రెడ్డి స్పందించారు. అవి ఆయన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అయినప్పటికీ తనను చేస్తేనే గెలుస్తది అనుకుంటే పొరబాటే అన్నారు. కాంగ్రెస్ ది ఎప్పుడైనా సమిష్ఠి విజయమేనని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు జీవన్ రెడ్డి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి