కోమటిరెడ్డి, సంపత్ కేసులో స్పీకర్ పై కాంగ్రెస్ ఒత్తిడి

congress mla  s meets telanana speaker
Highlights

పోరు తీవ్రం చేసిన కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేశారు. అయితే ఆ రద్దు అక్రమమని.. తక్షణమే వారి సభ్యత్వాలు పునరుద్ధరించాలి హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదని కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. సభ్యత్వాల పునరుద్ధరణ కోసం, ప్రొటోకాల్ కోసం కోమటిరెడ్డి, సంపత్ తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. తమకు గన్ మెన్లు కల్పించాలని వారు డిజిపిని కలిశారు. ప్రొటోకాల్ అమలు చేయాలని సిఎస్ శైలేంద్ర కుమార్ జోషిని కలిశారు.

తాజాగా హైకోర్టు తీర్పు కు అనుగుణంగా సభ్యత్వ రద్దు అయిన ఎమ్మెల్యే ల సభ్యత్వాలను పునరుద్ధరించాలని సీఎల్పీ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసింది కాంగ్రెస్ బృందం. తక్షణమే కోర్టు తీర్పును అమలు చేయాలని స్పీకర్ ను కోరారు కాంగ్రెస్ నేతలు.

అకారణంగా తమ సభ్యులిద్దరిపై వేటు వేశారని ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్ కు వివరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాల్సందిపోయి అప్రజాస్వామికంగా ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల మీద వేటు వేయడం సరికాదన్నారు. తక్షణమే వారి సభ్యత్వాలు పునరుద్ధరించి వారిక ప్రొటోకాల్ తో పాటు గన్ మెన్ల సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విన్నవించారు.

loader