హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరొస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని.... ఈ కార్యక్రమానికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  మల్లు భట్టి విక్రమార్క ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చడంతో పాటు ప్రాజెక్టు ‌లో అవకతవకలకు పరోక్షంగా మీరు కూడ పరోక్షంగా బాధ్యులు అవుతారని ఆయన వివరి:చారు.

టెండర్ల వివరాలను జ్యూడిషీయల్ కమిషన్ ముందు పెడతామని జగన్ నిర్ణయాన్ని మల్లు భట్టి విక్రమార్క స్వాగతించారు.  తెలంగాణలోనూ కూడ ఇదే తరహాలో టెండర్ల వివరాలు జ్యూడీషీయల్ కమిషన్ ముందు ఉంచాలని  ఆయన  డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను జ్యూడిషియల్ కమిషన్ ముందు ఉంచాలని  ఆయన కోరారు.

ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కేసీఆర్ ఆహ్వానించారు.