కెసిఆర్ కోమటిరెడ్డికి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏందో తెలుసా?

Congress MLA Komatireddy Venkatreddy   slams on KCR
Highlights

కోమటిరెడ్డికి కెసిఆర్ ఆఫర్ 


దేవరకొండ: తెలంగాణ సీఎం కెసిఆర్ తనకు బంపర్ ఆఫర్
ఇచ్చారని కానీ, తాను ఆ ఆఫర్ ను తిరస్కరించడంతో తనపై
కక్ష కట్టారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పల్లె నిద్ర పల్లె బాట కార్యక్రమాన్ని
నల్గొండ జిల్లా డిండిలో ప్రారంభించారు.  ఈ సందర్భంగా
ఆయన మీడియాతో మాట్లాడారు.

టిఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవిని ఇస్తానని సీఎం కెసిఆర్
తనకు ఆశచూపారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
అంతేకాదు ఇంకా ఏమి కావాలో చెప్పాలని కెసిఆర్ తనకు
ఆఫర్ ఇచ్చారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన తాను పార్టీ మారేందుకు
సిద్దంగా లేనని కెసిఆర్ ‌ఇచ్చిన ఆఫర్ ను తాను
తిరస్కరించినట్టు ఆయన చెప్పారు.

టిఆర్ఎస్ లో చేరలేదనే ఉద్దేశ్యంతోనే తనపై కెసిఆర్
కక్షసాధింపుకు పాల్పడ్డాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చెప్పారు.

ఎన్నికల్లో ఇచ్చిన హమీలను కెసిఆర్ ఒక్కటీ కూడ అమలు
చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్
పార్టీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని
ఆయన ధీమాను వ్యక్తం చేశారు.టిఆర్ఎస్ పట్ల ప్రజలు తీవ్ర
అసంతృప్తితో ఉన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

loader