సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తన పూర్తి మద్ధతు ఉంటుందన్నారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయనను వ్యతిరేకిస్తే.. రాహుల్ గాంధీని వ్యతిరేకించినట్లేనని ఆయన అభివర్ణించారు. భట్టిలో తాము రాహుల్ గాంధీని చూస్తామని, రాహుల్ మంచి వ్యూహకర్తని కొనియాడారు.

తెలంగాణలో సైతం ప్రియాంక గాంధీ ప్రభావం ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రియాంక అయినా రాహుల్ అయినా మెదక్ నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన కుటుంబం మెదక్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ వారిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని కోరారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే.