హైదరాబాద్: నోరుందని తమ పార్టీపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ నేతలను  హెచ్చరించారు. 
శుక్రవారం నాడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బచ్చాలకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం  తెలుసునని ఆయన ప్రశ్నించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడొద్దని ఆయన సూచించారు.

also read:కౌన్సిలర్ కే దిక్కులేదు, ఆస్పత్రులన్నీ తిరిగి మరణించింది: జగ్గారెడ్డి

కరోనాతో జనం చనిపోతోంటే మంత్రి తలసాని ఒక్కరోజైనా గాంధీ ఆసుపత్రికి వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లో కరోనా విషయమై ఆయన సమీక్షలు నిర్వహించారా అని అడిగారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెట్టిచాకిరి చేసే మనిషి అని  చెప్పారు. ఉద్యోగులకు ఏం చేశారని సీఎంకు శ్రీనివాస్ గౌడ్ స్వీట్లు తినిపించారని ఆయన ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చరిత్ర బయటపెడతానని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల గురించి ప్రజలు పట్టించుకోవాలని చెబుతున్నామన్నారు. అప్పుల గురించి పట్టించుకోకపోతే  బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉస్మానియా గురించి మాట్లాడే శ్రీనివాస్ యాదవ్ గాంధీ హాస్పిటల్‌కు ఎందుకు పోలేదని  ఆయన ప్రశ్నించారు. ‘‘మనం చేసేది దంగల్ కాదు పహిల్వాన్ గిరి బంద్ చెయ్..శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు! సీఎం కేసీఆర్ చెప్పింది చేయడానికి ఉన్న చెంచా!. అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 ఉద్యోగుల గురించి సీఎం ప్రకటన చేయగానే శ్రీనివాస్ గౌడ్-మమత అనే ఉద్యోగి ఎందుకు స్వీట్ తినిపిస్తారు!. మమత భర్త రిటైర్మెంట్ అయినా మళ్ళీ ఎలా పొడిగించారు!. శ్రీనివాస్ గౌడ్ చరిత్ర టైం వచ్చినప్పుడు బయటపెడుతా!. శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు! బ్రోకర్!!. మంత్రులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ ని విమర్శిస్తే సహించేది లేదు!. తెలంగాణను అప్పుల రాష్ట్రమని పేరు మార్చాల్సి వస్తుంది’’ అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.