తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ వద్ద పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య సరదా చర్చ జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ వద్ద పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య సరదా చర్చ జరిగింది. వీరిద్దరు అసెంబ్లీ ఆవరణలో ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడటం కనిపించింది. అక్కడ టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ కూడా ఉన్నారు. టీ షర్ట్‌లో ఉన్న జగ్గారెడ్డిలో చూసి పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్న? అని కేటీఆర్ అంటే.. టీ షర్ట్‌తో వేసుకుంటే పిల్లలవుతారా? అని జగ్గారెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మామిల్ల రాజేందర్‌ను.. ‘‘మీ ఇద్దరికి దోస్తాన్ ఎక్కడ కుదిరింది’’ అని కేటీఆర్ అడిగారు. ఇందుకు బదులిచ్చిన మామిల్ల రాజేందర్.. ‘‘మాది ఒకే కంచం.. ఒకే మంచం’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్.. మరి జగ్గారెడ్డిని గెలిపిస్తావా? అని ప్రశ్నించారు. ‘‘సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకొస్తాను’’ అని మామిల్ల సమాధానం ఇచ్చారు. కేటీఆర్‌తో జగ్గారెడ్డి సంభాషణకు సంబంధించి ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అంతేకాకుండా కేటీఆర్‌తో జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీలోని మంత్రి కేటీఆర్ చాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. కేటీఆర్‌తో జగ్గారెడ్డి బేటీకి సంబంధించి రాజకీయ వర్గాలు ఆసక్తికర చర్చ సాగుతుంది. అయితే తాను మర్యాదపూర్వకంగానే కేటీఆర్‌తో సమావేశమైనట్టుగా జగ్గారెడ్డి చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
