తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించారు కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తన గురించి నెగిటివ్‌‌గా ప్రచారం చేస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని .. పరువు నష్టం దావా వేస్తానని, లీగల్ నోటీసులు ఇస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించారు కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చానని చెప్పారు. అయినప్పటికీ పార్టీలో తనపై గుసగుసలాడుతున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా గుసగుసలు ఆపాలని.. మీ అనుమానాలను ప్రజలపై రుద్దొద్దని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

తన గురించి నెగిటివ్‌‌గా ప్రచారం చేస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని .. పరువు నష్టం దావా వేస్తానని, లీగల్ నోటీసులు ఇస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. తనను అనుమానించే వారికి ఏం పని లేదా.. నలభై ఏళ్లుగా కష్టపడి రాజకీయాల్లో వుంటున్నానని జగ్గారెడ్డి తెలిపారు. అప్పులు చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. అలాంటి తనకు ఆస్తులు వున్నాయని నిరూపిస్తే ప్రచారం చేసిన వారికే ఇచ్చేస్తానని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. 

కాగా.. రెండ్రోజుల క్రితం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిన్నర నుంచి కొంతమంది సోషల్ మీడియా ద్వారా తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. దీని వల్ల వాళ్లకు వచ్చే ఆనందం ఏంటో తనకు అర్ధం కావడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఎవరు వున్నారు.. వాళ్లకు దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలియడం లేదన్నారు. కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వుండొద్దా..? దీని వెనుక వ్యూహం వుందా, ఎవరున్నారు అని ఆయన ప్రశ్నించారు.

ALso Read: నాపై దుష్ప్రచారం.. నేను కాంగ్రెస్‌లో వుండొద్దా, మీకు ప్యాకేజీలేమైనా ఇస్తున్నారా : జగ్గారెడ్డి వ్యాఖ్యలు

తాను కన్నెర్ర చేస్తే మీరు వుంటారా అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. తాను పార్టీ మారుతున్నానని చెప్పడానికి మీకు ప్యాకేజీలు ఎవరిస్తున్నారు అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లోకి ఈ కల్చర్ తెచ్చిందే టీడీపీ అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని జగ్గారెడ్డి తెలిపారు. కార్యక్రమాలు చూసి రాహుల్ కూడా ఇంప్రెస్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. 

తన పేరు రాహుల్ గాంధీకి బాగా నోటెడ్ అయ్యిందని.. ఇది జరిగిన పదిరోజులకే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నానని ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఇంత శాడిజం ఏంటో అర్ధం కావడం లేదని.. 2018లో ప్రభుత్వం తనను జైలుకు పంపిందని జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్‌పై కొట్లాడి గెలిచానని.. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావొద్దనే ఉద్దేశంతో తన భార్యను పోటీకి పెట్టానని ఆయన వెల్లడించారు.