ముందు రేవంత్‌ను పిలవండి.. తర్వాతే నేనొస్తా: చిన్నారెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) వ్యవహారం టీపీసీసీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి (chinna reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

congress mla jagga reddy counter to chinna reddy comments

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) వ్యవహారం టీపీసీసీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి (chinna reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ (tpcc chief) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని (revanth reddy) కూడా కమిటీ ముందుకు పిలవాలని డిమాండ్ చేశారు. అప్పుడే తాను కమిటీ ముందు హాజరవుతానని తేల్చి చెప్పారు. 

సోనియా గాంధీకి (sonia gandhi) తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్‌ అయ్యిందో తెలియదన్న విషయం మీడియా ద్వారా కూడా వివరణ ఇచ్చినట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా? లేక మీడియాలో వచ్చిన వార్తలను కమిటీ సుమోటోగా తీసుకున్నదా? అన్న విషయాన్ని చిన్నారెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించి పార్టీ లైన్‌ దాటిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాడా? అని జగ్గారెడ్డి నిలదీశారు. 

Also Read:జగ్గారెడ్డి క్రమ శిక్షణను ఉల్లంఘించారు: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ చిన్నారెడ్డి సంచలనం

తన సొంత ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తనకు చెప్పకుండా కార్యక్రమం ప్రకటిస్తే అది క్రమశిక్షణ కిందకు రాదా? అని ఆయన ప్రశ్నించారు. వరంగల్‌ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిగా తాను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్టు ఇవాళ పత్రికల్లో చూశానని అన్నారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రేవంత్‌రెడ్డిని పిలిచిన తరువాత.. నన్ను పిలిస్తే తప్పకుండా హాజరవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

అసలు ఏం జరిగిందంటే?

ఈ ఏడాది డిసెంబర్ 27న ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించలేదు.  మరో వైపు ఈ రచ్చబండ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై కూడా జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో రచ్చబండి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు రేవంత్ రెడ్డిని హైద్రాబాద్ లోనే అరెస్ట్ చేశారు. 

అయితే అదే రోజున సాయంత్రం సోనియా గాంధీకి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకత్వం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించినందున అందరం కలుపుకుని పోతున్నామన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.  వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నాడని ఆయన మండిపడ్డారు. పార్టీ డైరెక్షన్ లో కాకుండా వ్యక్తిగత ఇమేజే కోసమే రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నాడని సోనియాకు రాసిన లేఖలో జగ్గారెడ్డి ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి తన స్వంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్ధిని బరిలోకి దింపలేని విషయాన్ని ఆ లేఖలో గుర్తు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవన్నారు.పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ లేఖను రాస్తున్నట్టుగా జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి స్టార్ లీడర్ గా ఎదగాలని అనుకొంటున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. గ్రామస్థాయికి వెళ్లి పనిచేసే ఉద్దేశ్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios