అప్పుడు కేసిఆర్ ను జైల్ల పెడితే ఎట్లుంటుండే ? (వీడియో)

అప్పుడు కేసిఆర్ ను జైల్ల పెడితే ఎట్లుంటుండే ? (వీడియో)

హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగను తొమ్మది రోజులుగా బెయిల్ ఇవ్వకుండా జైలులో పెట్టడం దారుణం అన్నారు కాంగ్రెస్ నేత డికె అరుణ. జైలులో మంద కృష్ణను ఆమె పరామర్శించి మీడియాతో మాట్లాడారు. కేసిఆర్ ఒకసారి పాత రోజులు గుర్తుకు తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు.

ఆనాడు ఉద్యమంలో అదే ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను కూలగొట్టిన సందర్బంగా కేసిఆర్ మీద ఎన్నికేసులు అయినయి. ఎన్నిరోజులు జైలులో ఉన్నారో చెప్పాలన్నారు. ప్రజా ఉద్యమాలను సానుకూలంగా చూడాలి తప్ప కక్ష పెట్టుకోవడం తగదన్నారు.

విధ్వంసం జరగనప్పుడు శాంతియుతంగా ఉద్యమం చేసినప్పుడు ఇన్నిరోజులు జైలులో పెడతారా? అని నిలదీశారు. ఇంకా డికె అరుణ అనేక అంశాలపై సర్కారును కడిగి పారేశారు. ఆమె మాటలు కింద వీడియోలో వినండి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos