కేసిఆర్ పై కాంగ్రెస్ చిన్నారెడ్డి ఫైర్

congress mla chinnareddy fire on cm kcr
Highlights

బెదిరించడం మంచి పద్ధతి కాదు

తెలంగాణ సిఎం కేసిఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.

ఆర్టీసీ ఉద్యోగులు ఏమి చేసుకుంటారో చెసుకోండి అంటున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవవహరించింది ఆర్టీసి కార్మికులే. ఆర్టీసీ ఉద్యోగులను సీఎం కేసీఆర్ చీదరించుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు వెంటనే పెంచాలి. ఆర్టీసీ నష్టాల్లో ఉంది అంటున్నారు ఇప్పటి ప్రభుత్వం. దానికి కారణం ప్రభుత్వ విధానాలే.

తమిళనాడు లో 4700 కోట్లు బడ్జెట్ లోప్రత్యేకంగా ఆర్టీసీ కి కేటాయించారు. ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి వివిధ రకాల ఉచిత బస్సు పాస్ ల కారణంగా ఆర్టీసీ నష్టపోతోంది. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు పాస్ లకు ఆర్టీసీ కి ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి. ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వవలిసిన అన్నిరకాల బెనిఫీట్ ఇవ్వాలి.

loader