రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి.

కందుల కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని  మల్లు రవి విమర్శించారు.

మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ లలో కొనుగోలు కేంద్రాలు మూత పెట్టారని ఆరోపించారు.

లక్షల టన్నుల కందులు కొనుగోలు లేక రైతులు నష్టపోతున్న పాలకులు నిర్లక్షంగా ఉన్నారని ఆయన విమర్శించారు.

కేంద్రం కొనుగోలు కేంద్రాలను మూసివేయడం దారుణమన్నారు.

రైతుల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అని ఆయన దుయ్యబట్టారు.