తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ పంచాయతీ కాకలు రేపుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఇటీవలే రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

మూడు నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక దీనిపై అధిష్టానం నుంచే ఓ ప్రకటన రావాల్సి ఉన్న తరుణంలో పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు హస్తిన బాట పట్టారు.

Also Read:లీగ్ ఓడితే కప్ గెలవలేమా.. సోనియా చేతుల్లోనే అంతా: మాణిక్యం ఠాగూర్

ముందుగా టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాల్సిందే అని కోరుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సోనియాగాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితుల గురించి వివరించారు.

టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని ఆయన సోనియా కి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవి రేసులో వున్న ఎంపీ రేవంత్ రెడ్డి కూడా నేడు ఢిల్లీ పట్టారు.

 అందుబాటులో వుండాలని రాహుల్ చెప్పడంతో కోమటిరెడ్డి ఎప్పుడైనా కలిసే అవకాశం వుంది. మరోవైపు అధిష్టానం పిలుపు మేరకు మరోనేత సంపత్ ఢిల్లీ బయల్దేరుతున్నారు.