హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి తరపున పోటీ చేయాలని భావిస్తున్న కోదండరామ్ కు కాంగ్రెస్ నేతల నుండి వ్యతిరేకత నెలకొంది. స్వంతంగా పోటీ చేయాలని పార్టీ నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఠాగూర్ కు తేల్చి చెప్పారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై  జిల్లాల నేతలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ  మాణికం ఠాగూర్ చర్చించారు.ఈ విషయమై ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన నేతలతో ఠాగూర్ చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీజేఎస్ పోటీ చేయాలని భావిస్తోంది.

ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని టీజేఎస్  కోరింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం  నుండి  కోదండరామ్ పోటీ చేయాలని  భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. 

also read:టిక్కెట్ల కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ: మధ్యలో కోదండరామ్, ఎవరికి దక్కునో?

ఈ విషయమై ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల సమావేశంలో చర్చకు వచ్చింది.కాంగ్రెస్ పార్టీ నేతలకు టిక్కెట్టు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టమనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్టు ఇవ్వాలని  పార్టీకి చెందిన మెజారిటీ నేతలు కోరారు.కోదంరామ్ కి మద్దతు ఇవ్వడం వల్ల పార్టీ నష్టపోతోందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. బలమైన  అభ్యర్ధిని నిలబెట్టాలని పార్టీ నేతలు కోరారు. ఏకాభిప్రాయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధిని నిలుపుదామని పార్టీ నేతలు చేసిన సూచన పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు.