తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు. రైతు సమస్యలతో పాటు పలు అంశాలపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్.. తదితరులు ఉన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు. రైతు సమస్యలతో పాటు పలు అంశాలపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వరి కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం, రైతుల ఖాతాలో జమ చేయాలని, విద్యుత్ చార్జీల పెంపుపై.. ఇలా పలు అంశాలపై గవర్నర్‌కు నివేదికను అందజేశారు. జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్.. తదితరులు ఉన్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలు, తెలంగాణ ప్రభుత్వ అవకతవకలపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చినట్టుగా చెప్పారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల రైతులు పండించిన ధాన్యంలో 30 శాతాన్ని మిల్లరు తక్కువ రేటుకే కొనుగోలు చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దీని వల్ల రైతులకు రూ. 2 వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. ఏ రైతు ఎంత ధాన్యం అమ్మారో మిల్లర్ల దగ్గర వివరాలు ఉన్నాయని అన్నారు. ఆ రైతులు నష్టపోయిన సొమ్మును ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. వడ్లు-బియ్యం మాయం చేసిన వాళ్లపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
20 లక్షల ఎకరాల్లో పంట వేయని రైతులకు ఎకరాకు రూ. 15 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాల్ చేసిన అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు. గల్లిలో ప్రభుత్వం నడిపే వాళ్లు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని..ఢిల్లీలో ప్రభుత్వం నడిపేవాళ్లు..గల్లిలో ధర్నా చేస్తున్నారన్నారని మండిపడ్డారు.
తమ ఉద్యమంతోనే వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ దిగొచ్చారన్నారు. సిగ్గులేకుండా తమ విజయమని బీజేపీ వాళ్లు చెప్పుకుంటున్నారన్నారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు. రూ. 11 వేల కోట్ల ఆస్తులను కొల్లగొట్టేందుకు 111 జీవో ఎత్తేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. కౌలు రైతులకు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక కార్యచరణ తీసుకుని.. నాలుగు, ఐదు రోజుల్లోనే ధాన్యం మొత్తం సేకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజ కొనే వరకు పోరాడుతామని తెలిపారు. రైతులకు రూ.1960 ఇచ్చినా గిట్టుబాటు కాదని.. కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
