Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు బయల్దేరిన సీఎల్పీ బృందం.. భట్టి, సీతక్క సహా నేతల అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో భట్టి విక్రమార్క, సీతక్క, జీవన్ రెడ్డిలను మణుగూరు క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి పాల్వంచ పీఎస్‌కు తరలించారు
 

congress leaders arrested in bhadrachalam
Author
Khammam, First Published Aug 16, 2022, 10:20 PM IST

తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయల్దేరిన సీఎల్పీ బృందాన్ని భద్రాచలంలో అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అక్కడే బైఠాయించారు కాంగ్రెస్ నేతలు.  పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో భట్టి విక్రమార్క, సీతక్క, జీవన్ రెడ్డిలను మణుగూరు క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి పాల్వంచ పీఎస్‌కు తరలించారు. దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. 

ఇకపోతే.. ఇవాళ్టీ నుండి ప్రాజెక్టులను పరిశీలనకు వెళ్లాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత వారం హైద్రాబాద్ లో సమావేశమైన సీఎల్పీ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. జూలై, ఆగష్టు మాసాల్లో కురిసిన వర్షాలు, భారీగా వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించాలని సీఎల్పీ నిర్ణయించింది. ఇవాళ దుమ్ముగూడెం నుండి ప్రాజెక్టుల సందర్శనను సీఎల్పీ ప్రారంభించింది.

ALso Read:దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు సీఎల్పీ టీమ్: అడ్దుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయింపు

అయితే దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద  సీఎల్పీ బృందాన్ని మంగళవారం నాడు  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో సీఎల్పీ బృందం వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పరిశీలనకు అనుమతివ్వాలని సీఎల్పీ బృందం పోలీసు ఉన్నతాధికారులతో పోన్ చేసి మాట్లాడింది. అయితే మావోయిస్టు  ప్రాబల్యం ఉన్న ప్రాంతమైనందున దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లొద్దని సీఎల్పీ బృందానికి పోలీసులు అడ్డు చెప్పారు.  భద్రతా కారణాల రీత్యా  ప్రాజెక్టు సందర్శనను అనుమతి ఇవ్వకపోవడాన్ని సీఎల్పీ బృందం తప్పు బట్టింది. సీఎల్పీ బృందం దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శించడం వల్ల అక్కడ లోపాలు బయటపడతాయనే భయం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.

ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు  కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. దీంతో  కడెం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని ఈప్రాజెక్టు కింద ఉన్న 25 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే  ఈ ప్రాజెక్టుకు చెందిన ఓ గేటు కూడా ఆ సమయంలో పని చేయలేదు.  ఈ ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని ఆ సమయంలో అనుకున్నారు. అయితే ప్రాజెక్టు కు సంబంధించిన కాలువ  దెబ్బతినడంతో వరద నీరు అటు వైపు నుండి కూడా వెళ్లిపోయింది. దీంతో ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ప్రాజెక్టు 3 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రం తట్టుకొనే సామర్ధ్యం ఉంది. అయితే  జూలై మాసంలో వచ్చిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు సుమారు 5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.   అయితే అదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టుకు ఏం కాలేదని  కేసీఆర్ కూడా ప్రకటించారు

Follow Us:
Download App:
  • android
  • ios