Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ....: బడ్జెట్ పై విజయశాంతి ఫైర్


కేసీఆర్ లెక్క, పద్దుల విషయం ఏమోగానీ గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారి ప్రకటనల ద్వారా అర్ధం అవుతోందన్నారు. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలి అంటూ సెటైర్లు వేశారు.
 

congress leader vijaya shanthi slams kcr over budget
Author
Hyderabad, First Published Sep 9, 2019, 4:58 PM IST

హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. బడ్జెట్ లో అన్ని రంగాలను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు.

చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమో అంటూ సెటైర్లు వేశారు.  

గతేడాది లక్షన్నర కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌ను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ అక్షరాస్యత కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. అక్షరాస్యత కల్పించడంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగులో ఉందని ఓ సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. 

తెలంగాణలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 

ఆరోగ్యశ్రీ బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వంటి నిర్లక్ష్య ధోరణితో పేద రోగుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ అర్థమైందని మండిపడ్డారు. ఆఖరికి రైతులకు యూరియా అందించే విషయంలో కూడా కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కీలకమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గత బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు. 

అయితే ఈ కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఏమయ్యాయో టీఆర్ఎస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత బడ్జెట్ లెక్కలు తేలకముందే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కొత్త బడ్జెట్ పేరుతో గారడికి సిద్ధమయ్యారని విమర్శించారు. 

కెసిఆర్ లెక్క, పద్దుల విషయం ఏమోగానీ గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారి ప్రకటనల ద్వారా అర్ధం అవుతోందన్నారు. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలి అంటూ సెటైర్లు వేశారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బడ్జెట్: ఆర్థిక పరిస్థితి ఇదీ...

తెలంగాణ బడ్జెట్ : రైతుబందు పథకానికి రూ. 12 వేల కోట్లు

తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు
రూ.1,46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్: ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios