Asianet News TeluguAsianet News Telugu

ప్రేమోన్మాద దాడులపై విజయశాంతి ఆవేదన... ప్రతిఘటన సినిమా గుర్తుచేసుకుని

ప్రేమ పేరుతో ఇటీవల అమ్మాయిలపై జరుగుతున్న పాశవికమైన దాడులను మాజీ  ఎంపి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఖండిచారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ మధులిమ అనే కాలేజి విద్యార్థినిపై జరిగిన దాడి తననెంతో బాధించిందని అన్నారు. మరోసారి ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. 

congress leader vijaya shanthi respond on love attacks
Author
Hyderabad, First Published Feb 8, 2019, 9:16 PM IST

ప్రేమ పేరుతో ఇటీవల అమ్మాయిలపై జరుగుతున్న పాశవికమైన దాడులను మాజీ  ఎంపి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఖండిచారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ మధులిమ అనే కాలేజి విద్యార్థినిపై జరిగిన దాడి తననెంతో బాధించిందని అన్నారు. మరోసారి ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. 

ఇంట్లోంచి బయటకు వెళ్లిన అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో అమ్మాయిలపై ప్రేమోన్మాదులు దాడులకు పాల్పడటం  పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి  ఘటనలతో అమ్మాయిల్లోనే కాదు వారి తల్లిందండ్రుల్లోను భయాన్ని మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి వారిలో దైర్యాన్ని పెంచి అమ్మాయిలకు వారి రక్షణ విషయంలో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విజయశాంతి అన్నారు. 

అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్న ప్రేమోన్మాదుల అకృత్యాలపై మొక్కుబడి చర్యలతో సరిపెట్టకూడదని సూచించారు. ఇలాంటి  ఘటనలను చూస్తుంటే తాను నటించిన ప్రతిఘటన చిత్రంలోని 'ఈ దుర్యోధన, దుశ్శాసన'' పాట గుర్తొస్తోందని విజయశాంతి గుర్తు చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios