వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సంతాపం తెలిపారు.

వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సంతాపం తెలిపారు. వివేకా మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. వివేకా మృతిపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయనన్ారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శుక్రవారం వీహెచ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ కి చెందిన యాగా కంపెనీకి ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.

రేవంత్ రెడ్డికి అయితే ఒక నీతి.. జగన్ కి అయితే మరో నీతా అని మండిపడ్డారు.రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని, నరేంద్రమోదీకి.. జగన్‌ అవినీతిపరుడిగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు వ్యభిచారం కంటే హీనమని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.