జోగిని శ్యామల మాటలు నిజమౌతాయి: వీహెచ్

Congress leader V. Hanumantha rao supports to Jogini shyamala
Highlights

సికింద్రాబాద్ బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ  అనుసరించిన తీరుపై  కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. జోగిని శ్యామలకు  మాజీ ఎంపీ వి.హనుమంతరావు మద్దతు పలికారు.


హైదరాబాద్: సికింద్రాబాద్ బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ  అనుసరించిన తీరుపై  కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. జోగిని శ్యామలకు  మాజీ ఎంపీ వి.హనుమంతరావు మద్దతు పలికారు.

ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చిన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై జోగిని శ్యామల  ఆగ్రహం వ్యక్తం చేశారు.  బోనం ఎత్తుకొన్న తనపై  పోలీసులు  అవమానించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిపోతోందని ఆమె శాపనార్థాలు పెట్టారు. 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జోగిని శ్యామల చెప్పింది వాస్తవమేనని హనుమంతరావు చెప్పారు. శ్యామల చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయన్నారు.  తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వపాలన ముగియడం ఖాయమన్నారు.

తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని  ఆయన దుయ్యబట్టారు.  గ్రామాలకు ప్రత్యేక అధికారులు వస్తే తరిమికొట్టాలని  వీహెచ్  ప్రజలను కోరారు. 

తెలంగాణలో నియంతృత్వ రాజ్యం నడుస్తోందన్నారు.ప్రజలు ప్రభుత్వంపై తిరగబడితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తోందని వీహెచ్ హామీ ఇచ్చారు.బీసీలను టీఆర్ఎస్ అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఈ వార్త చదవండి:జోగిని శ్యామలకు మంత్రి తలసాని కౌంటర్: కొన్ని ఇబ్బందులు జరిగాయి
 

loader