హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. హనుమంతరావు తీరుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు షాక్‌కు గురయ్యారు.

మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించేందుకు గాను గాంధీభవన్‌లో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ  కోర్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశానికి కోర్ కమిటీకి సంబంధం లేని వారిని కూడ పిలవడంపై ఆ పార్టీ నేత హనుమంతరావు మండిపడ్డారు. కోర్‌కమిటీకి సంబంధం లేని వ్యక్తులను ఎందుకు పిలిచారని ఆయన ప్రశ్నించారు. 

కోర్‌కమిటీ సమావేశం అంటే అర్థం పర్థం లేకుండా చేశారని హనుమంతరావు మండిపడ్డారు. కోర్ కమిటీకి సంబంధం లేని వారిని సమావేశానికి పిలవడంపై హనుమంతరావు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

కోర్‌కమిటీ సమావేశం నుండి హనుమంతరావు బయటకు వచ్చారు. కొందరు నేతలు వీహెచ్‌ను  సమావేశంలోకి రావాలని కోరారు.అయినా కూడ వీహెచ్ మాత్రం ఒప్పుకోలేదు. సమావేశాలకు అర్థం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమావేశం బయటకు వెళ్తూ పార్టీ నేతలపై మండిపడుతూ వెళ్లిపోయారు.