Asianet News TeluguAsianet News Telugu

ఓ ఆడబిడ్డ పార్టీ అధ్యక్షురాలిగా వుండొద్దా... పోలీసులది ప్రేక్షక పాత్రే : షర్మిల అరెస్ట్‌పై జీవన్ రెడ్డి ఆగ్రహం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలి అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై టీ.కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. 

congress leader t jeevan reddy response on ys sharmila arrest
Author
First Published Nov 29, 2022, 6:43 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై స్పందించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఆడబిడ్డపై దాడులు సరికాదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డ పార్టీ అధ్యక్షురాలిగా వుండకూడదా... ఆమె యాత్రను అడ్డుకోవడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. షర్మిల ఏమైనా విమర్శలు చేసుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ, దాడులు సరికాదని జీవన్ రెడ్డి హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అనుమతించకపోవడం దారుణమని... అధికారపక్షం దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ  నియోజకవర్గంలోని  లింగగిరిలో  వైఎస్ షర్మిలకు చెందిన  బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు  షర్మిల  పార్టీకి  చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో  నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో  వైఎస్  షర్మిలను పోలీసులు  అరెస్ట్ చేసి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్‌లో వదిలి వెళ్లిపోయారు.  

ALso REad:మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. పోలీసులు మాకేం కొత్తా : షర్మిల అరెస్ట్‌పై వైఎస్ విజయమ్మ

అయితే నర్సంపేటలో టీఆర్ఎస్  శ్రేణుల దాడికి నిరసనగా  ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని  వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది.    పోలీసుల కళ్లుగప్పి  షర్మిల  లోటస్  పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన  కారుతో  ప్రగతి భవన్ వైపునకు వెళ్లే  ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో  షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా  ఆమె  నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత  కూడా  ఆమె  కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్  చేసి  షర్మిలను  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా  వచ్చిన  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios