కార్యకర్తల కోసం ఎంతవరకైనా వెళ్తా .. పాలేరు కన్నా నాకు ఆ స్థానాలే ఎక్కువ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తానన్నారు కాంగ్రెస్ నేత, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాను పోటీ చేస్తున్న పాలేరు కంటే మిగిలిన నియోజకవర్గాలకే 75 శాతం సమయం కేటాయిస్తున్నానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తానన్నారు కాంగ్రెస్ నేత, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 72 నుంచి 78 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను పోటీ చేస్తున్న పాలేరు కంటే మిగిలిన నియోజకవర్గాలకే 75 శాతం సమయం కేటాయిస్తున్నానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించామన్నారు. మీ శ్రీనన్న ఒక ఉన్నతమైన పొజిషలన్‌లో వుంటాడని ఆయన పేర్కొన్నారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం అభ్యర్ధి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తాను కూడా పోటీ చేయాలని అనుకోలేదన్నారు. సీపీఐ నారాయణ, రాష్ట్ర కమిటీ ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకున్నానని కూనంనేని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటికి ప్రజాబలం వుందని.. పాలేరులో పొంగులేటికి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు సీపీఐ మద్ధతు ఇస్తుందని ఆయన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆశించిన విధంగా పదికి 10 స్థానాల్లోనూ కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు కైవసం చేసుకుంటాయని సాంబశివరావు పేర్కొన్నారు. తాను ఎవరికీ ఇబ్బందులు కలిగించనని, ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించనని ఆయన స్పష్టం చేశారు.
Also Read: హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
మరోవైపు.. ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఇవాళ తాను నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని.. ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్నట్లుగా లక్ష కూడా పట్టుకోలేదని పొంగులేటి వ్యాఖ్యానించారు