Asianet News TeluguAsianet News Telugu

'మర్రి' కి కోదండరెడ్డి ఫోన్: సోనియా అపాయింట్ మెంట్ కోరిన శశిధర్ రెడ్డి

పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను సోనియా గాంధీకి వివరించేందుకు గాను మర్రి శశిదర్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన శశిధర్ రెడ్డి సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Congress leader Marri Shashidhar Reddy tries Sonia Gandhi Appointment
Author
Hyderabad, First Published Aug 18, 2022, 4:54 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ కోదండరెడ్డి పోన్ చేశారు. సీనియర్ నేతగా ఉన్న శశిధర్ రెడ్డి బహిరంగంగా మీడియాలో చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ సీనియర్లుగా ఉన్న నేతలే ఈ రకంగా బహరింగంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని కోదండరెడ్డి  శశిధర్ రెడ్డితో వ్యాఖ్యానించినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.  పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై అంతర్గత సమావేశాల్లో చర్చించకుండా బహిరంగంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరాన్ని ప్రశ్నించారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలే పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించవద్దని కోదండరెడ్డి కోరినట్టుగా తెలిసింది. 

మర్రి శశిధర్ రెడ్డి  రేవంత్ రెడ్డితో పాటు మాణికం ఠాగూర్ పై వ్యాఖ్యలు చేయడంపై పార్టీలో చర్చ సాగుతుంది.  పార్టీ కి నష్టం కల్గించేలా వ్యవహరించవద్దని సూచించే శశిధర్ రెడ్డి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంపై  పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలోనో , మాణికం ఠాగూర్ వద్ద జరిగే సమావేశాల్లోనో ఈ అంశాలను చర్చించకుండా మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయడంపైనే నేతలు ఆశ్చర్యపోతున్నారు.

బుధవారం నాడు రాత్రి మర్రి శశిధర్ రెడ్డితో కొందరు పార్టీ సీనియర్లు భేటీ అయ్యారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించినట్టుగా సమాచారం. ఇదే సమయంలో పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని కలిసి రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలను వివరించాలని  మర్రి శశిధర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరారు. సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇస్తే పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆయన వివరించనున్నారు.రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ సోనియా అపాయింట్ మెంట్ దొరికితే ఈ విషయాలను సీనియర్లు సోనియాకు వివరించనున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా ఉన్న మాణికం ఠాగూర్  తీరును కూడా పార్టీ నేతలు కొందరు తప్పు బడుతున్నారు. రేవంత్ రెడ్డి తీసుకంటున్న నిర్ణయాలను మాణికం ఠాగూర్ సమర్ధిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా వీరిద్దరితో కలిసి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి భిన్నంగా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు ఇస్తున్నారని సీనియర్లు ఆరోపణలు చేస్తున్నారు. 

also read:ఠాగూర్ పై వ్యాఖ్యలు: మర్రి శశిధర్ రెడ్డితో భేటీ కానున్న ఎఐసీసీ సెక్రటరీ జావెద్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాణికం ఠాగూర్ ఏజంట్ అంటూ  కూడా మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై అద్దంకి దయాకర్ ఇవాళ స్పందించారు. పార్టీ వేదికలపై చర్చించే అవకాశం ఉండి కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం శశిధర్ రెడ్డికి తగదని దయాకర్ శశిధర్ రెడ్డికి సూచించారు.ఇదిలా ఉంటే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన సోనియాగాంధీకి వివరించే అవకాశం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios