Asianet News TeluguAsianet News Telugu

జానారెడ్డి ఇంటికి మాణిక్ ఠాక్రే: పార్టీ నేతల సమన్వయంపై చర్చ

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు  ఠాక్రే  ఆదివారం నాడు  జానారెడ్డికి వెళ్లారు.

Congress leader   Manikrao Thakre Meets  Former  Minister  Jana Reddy
Author
First Published Feb 5, 2023, 11:57 AM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  ఆదివారం నాడు  కాంగ్రెస్ పార్టీ సీనియర్  నేత జానారెడ్డి  ఇంటికి  వెళ్లారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం,  హత్ సే హత్  జోడో పై జానారెడ్డితో చర్చించనున్నారు.  రెండు రోజుల క్రితం   మాణిక్ రావు  ఠాక్రే   హైద్రాబాద్ కు  వచ్చారు.  నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో  మాణిక్ రావు ఠాక్రే  భేటీ అయ్యారు.   హత్ సే హత్  జోడో  యాత్రపై  మాణిక్ రావు ఠాక్రే   చర్చించారు.  ఈ నెల  6వ తేదీ నుండి  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి   మేడారంలో  పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఈ యాత్రలో  రేవంత్ రెడ్డితో పాటు  మాణిక్ రావు ఠాక్రే కూడా పాల్గొంటారు.

రాష్ట్రంలో  కాంగ్రెస్  పార్టీలో సీనియర్లు, రేవంత్ రెడ్డి మధ్య  కొంతకాలంగా  అగాధం చోటు  చేసుకుంది. ఈ  అగాధాన్ని పూడ్చేందుకు  గతంలో  పార్టీ ఇంచార్జీగా  ఉన్న మాణికం ఠాగూర్  వ్యవహరించలేదనే  అభిప్రాయాలు  సీనియర్లలో  ఉన్నాయి. ఈ విషయమై  గత ఏడాది చివర్లో  రాష్ట్రంలో  పర్యటించిన దిగ్విజయ్ సింగ్  పార్టీ రాష్ట్ర నాయకత్వానికి  నివేదిక  ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా  మాణికం ఠాగూర్  ను తొలగించారు.  మహరాష్ట్రకు చెందిన  మాణిక్ రావు  ఠాక్రే ను   నియమించారు.

also read:రేవంత్ రెడ్డి పాదయాత్రపై మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం: హట్ హట్ గా కాంగ్రెస్ సీనియర్ల సమావేశం

రాష్ట్రంలో  పార్టీ నేతల మధ్య సమన్వయం  పెంచేందుకు  తీసుకోవాల్సిన చర్యలపై  చర్చించారు. రాష్ట్రంలో  బీఆర్ఎస్ , బీజేపీలను ఎదుర్కొనేందుకు  అనుసరించాల్సిన  వ్యూహంపై జానారెడ్డితో  చర్చించనున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios