హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఈ నెల 13న హైద్రాబాద్ కు రానున్నారు. ఈ నెల 14న ఆయన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాణికం ఠాగూర్ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణ వ్యవహరాలకు ఇంతకాలం పాటు దూరంగా ఉన్నారు.ఈ నెల 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. 

దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మాణికం ఠాగూర్ ఈ నెల 13న తెలంగాణకు రానున్నారు. ఈ నెల 13న ఆయన హైద్రాబాద్ చేరుకొంటారు. పార్టీ నేతలతో ఎన్నికల విషయమై చర్చిస్తారు. ఈ నెల 14న సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ఈ నెల 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉన్నారు.టీఆర్ఎస్ నుండి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్, బీజేపీ నుండి డాక్టర్ రవికుమార్ నాయక్ పోటీ చేస్తున్నారు.