తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. దళితుల పట్ల కేసీఆర్ వివక్ష చూపుతుందని ఆయన ఆరోపించారు. 2023లో తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తారా అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు ఠాగూర్.
హైదరాబాద్: 2023 ఎన్నికల్లోనైనా తెలంగాణకు (Telangana)దళితుడిని సీఎం చేస్తానని చెప్పే ధైర్యం కేసీఆర్ (kcr) కు ఉందా అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ (manickam Tagore)ప్రశ్నించారు.
also read:Huzurabad bypoll:బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్
ఆదివారం నాడు ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్(trs) చీఫ్ కేసీఆర్. కేసీఆర్ సర్కార్ ప్రతి పనిలో 20 శాతం కమీషన్ తీసుకొంటుందని ఆయన ఆరోపించారు. కమీషన్ లేనిదే పని జరగదన్నారు.
దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ మనువాది అంటూ ఆయన ఫైరయ్యారు. ప్రతిపక్ష నేతలుగా ఉన్న దళితులను చూడలేకపోతున్నారన్నారు.కేబినెట్ చివరి వరుసలో ఎస్సీ శాఖను ఇచ్చారని చెప్పారు.పురపాలక శాఖను దళితులకు ఇచ్చే ధైర్యం కేసీఆర్ కు ఉందా అని మాణికం ఠాగూర్ ప్రశ్నించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపికతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ఠాగూర్ హైద్రాబాద్ వచ్చారు. నాలుగు రోజుల పాటు ఠాగూర్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
