హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఓటు గల్లంతైంది. ఈ విషయమై ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని పలు డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించినట్టుగా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో తమ ఓట్లు ఉన్నప్పటికీ కూడ ఫైనల్ ఓటరు జాబితాలో మాత్రం ఓట్లు  లేకపోవడంతో ఓటర్లు షాక్ తిన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరుత్సాహనికి గురయ్యారు.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: ఎగ్టిట్ పోల్స్ పై నిషేధం

జియాగూడలోని 38 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓట్లు గల్లంతయ్యాయి. 914 ఓట్లలో 657 ఓట్లు గల్లంతయ్యాయి.  ఓటర్ స్లిప్ లు అందినా తమ ఓట్లు లేకపోవడంపై ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు.

ఓల్డ్ సిటీలో పలు చోట్ల పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. /జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా  అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఓటర్ల జాబితా విషయంలో పలు రాజకీయ పార్టీలు గతంలోనే పలు ఫిర్యాదు చేశాయి. అయినా కూడ పరిస్థితిలోో మార్పు రాలేదు.