నిన్న కోమటిరెడ్డికి క్షమాపణలు: నేడు అద్దంకి దయాకర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ నివాసంలో మాజీ ఎంపీ మల్లు రవి, బెల్లయ్య నాయక్ తదితరలు సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ నిన్ననే క్షమాపణలు చెప్పారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ నివాసంలో మాజీ ఎంపీ మల్లు రవి, పార్టీ నేత బెల్లయ్యనాయక్, చరుణ్ కౌశిక్ ఆదివారం నాడు భేటీ అయ్యారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని చండూరు సభలో దూషించిన విషయమై క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయమై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారనే విషయమై పార్టీ నాయకత్వం ఎదురు చూస్తుంది. . ఈ నెల 5వ తేదీన చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మండిపడుతున్నారు.ఈ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో వేదికపై ఉన్న నేతలు అద్దంకి దయాకర్ ను ఎందుకు వారించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. షోకాజ్ నోటీసుల పేరుతో పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కూడా మరోసారి డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అంతేకాదు అద్దంకి దయాకర్ కూడా ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి తాను క్షమాపణలు అడుగుతానని కూడా ఆయన చెప్పారు. ఈ నెల 13వ తేదీన రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.
also read:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి క్షమాపణ చెబుతున్నాను.. మరోసారి అలా జరగనివ్వను: అద్దంకి దయాకర్
మునుగోడు అసెంబ్లీ స్థానంలో ప్రచారానికి సంబంధించి తనకు పార్టీ నాయకత్వం నుండి ఆహ్వానం కూడ లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పి మునుగోడులో ప్రచారానికి ఆహ్వానిస్తే తాను ఆలోచిస్తానని రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ తరుణంలోనే అద్దంకి దయాకర్ నివాసంలో నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.