Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి క్షమాపణ చెబుతున్నాను.. మరోసారి అలా జరగనివ్వను: అద్దంకి దయాకర్

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి క్షమాపణ చెబుతున్నట్టుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. భవిష్యత్తులో మరోసారి అలా జరగనివ్వనని చెప్పారు. 

Addanki dayaker once agains apologises to  Komatireddy Venkata Reddy
Author
First Published Aug 13, 2022, 11:23 AM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతున్నట్టుగా తెలిపారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టువీడటం లేదు. అద్దంకి దయాకర్‌పై పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి క్షమాపణ చెబుతున్నట్టుగా తెలిపారు. భవిష్యత్తులో మరోసారి అలా జరగనివ్వనని చెప్పారు. పార్టీకి నష్టం జరగకూడదని మరోసారి క్షమాపణ చెబుతున్నట్టుగా వెల్లడించారు. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిందని.. వాటిపై రాతపూర్వకంగా క్షమాపణ కోరానని చెప్పారు. పార్టీతో కలిసి పనిచేసేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని అన్నారు. 

ఇక, చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో మాట్లాడిన అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పరుష పదజాలం వినియోగించారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్ కామెంట్స్ పార్టీకి నష్టం చేకూరుస్తాయని భావించిని కాంగ్రెస్ పార్టీ.. అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన అద్దంకి దయాకర్.. చండూరులో జరిగిన బహిరంగ సభలో వెంకట్ రెడ్డిపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పారు. 

‘‘వెంకట్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలుస్తాను, క్షమాపణలు చెబుతాను. ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను అనుకోను. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటాను’’ అని దయాకర్ చెప్పారు. 

అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల సన్నాహక సమావేశాలకు పార్టీ అధిష్టానం తనను ఆహ్వానించడం ఆరోపించారు. సమావేశాల గురించి తనకు తెలియదని.. కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోని పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

తనను హోంగార్డుతో పోల్చడం అత్యంత బాధ కల్గించిందన్నారు. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. ‘‘నన్ను అవమానిస్తే పార్టీని వీడుతానని వారు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి తీసుకెళ్తాను. పార్టీ నాయకుల నుంచి తనకు జరిగిన అవమానాలను వివరిస్తాను’’ అని ఆయన చెప్పారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని కాంగ్రెస్ సీనియర్స్‌ నుంచి కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినట్టుగా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios