తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రా ప్రజలపై విద్వేశం ఇంకా ప్రదర్శిస్తున్నారని మాజీ ఎంపి, ఏఐసిసి కార్యదర్శి మదుయాష్కి ఆరోపించారు. హైదరాబాద్ ప్రముఖ కంటి దవాఖాన ఎల్వీ ప్రసాద్ ఆంధ్ర వాళ్లది కావడం వల్లే అందులో చికిత్స చేయించుకోడానికి కేసీఆర్ ఆసక్తి చూపించలేదని అన్నారు. అందువల్లే డిల్లీకి వెళ్లి చికిత్స చేయించుకున్నారని మదుయాష్కి తెలిపారు. తెలంగాణ ప్రజలకేమో ఇక్కడ కంటివెలుగు పరీక్షలు చేయించి సీఎం మాత్రం తన కళ్ల పరీక్ష కోసం డిల్లీకి వెళ్లారని యాష్కి ఎద్దేవా చేశారు. 

దేశ నలుమూలల నుండి చాలామంది వైద్యం కోసం హైదరాబాద్‌ వస్తుంటారని మధుయాష్కి గుర్తు చేశారు. అలాంటి చోట కాకుండా కేసీఆర్‌ డిల్లీకి వెళ్లి వైద్యం చేయించుకోడానికి ఆంధ్రులపై ఆయనకున్న ద్వేషమే కారణమని వ్యాఖ్యానించారు. 

సోమవారం గాంధీభవన్‌లో యాష్కి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు.మోదీ ప్రేమలో కేసీఆర్ గుడ్డివాడం వల్లే సీమాంధ్రులంటే ఆయనకునచ్చడం లేదన్నారు. అందువల్ల అధికారం కోసం గడ్డితినే కేసీఆర్‌ కుటుంబాన్ని సీమాంధ్రులు నమ్మవద్దని యాష్కి సూచించారు. 

తెలంగాణ లోని సీమాంధ్రులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంలుందని యాష్కి తెలిపారు.  టీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు ఆంధ్రులెవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన సూచించారు. టీఆర్‌ఎస్‌ దాడులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తుందని యధు యాష్కి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు

తెలంగాణ శశికళ కవిత, కేటీఆర్ ఓ బెప్పం, లాగులు తడుస్తాయ్: మధుయాష్కీ