Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ శశికళ కవిత, కేటీఆర్ ఓ బెప్పం, లాగులు తడుస్తాయ్: మధుయాష్కీ

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ మాజీఎంపీ మధుయాష్కీ గౌడ్ నిప్పులు చెరిగారు. మంత్రి కేటీఆర్ ఓ బెప్పంగాడు అంటూ ఘటుగా విమర్శించారు. ఈనాలుగున్నరేళ్ల కాలంలో ఎంపీ కవిత తమిళనాడులోని శశికళ కంటే ఎక్కువే అక్రమాస్తులు కూడబెట్టిందని ఆరోపించారు. 

madhu yaskhy fires on kcr family
Author
Hyderabad, First Published Oct 29, 2018, 7:42 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ మాజీఎంపీ మధుయాష్కీ గౌడ్ నిప్పులు చెరిగారు. మంత్రి కేటీఆర్ ఓ బెప్పంగాడు అంటూ ఘటుగా విమర్శించారు. ఈనాలుగున్నరేళ్ల కాలంలో ఎంపీ కవిత తమిళనాడులోని శశికళ కంటే ఎక్కువే అక్రమాస్తులు కూడబెట్టిందని ఆరోపించారు. 

ఎంపీ కవిత తెలంగాణ శశికల అంటూ ధ్వజమెత్తారు. కల్వకుంట్ల అజయ్ రావు పేరుమీద ఎన్ని కంపెనీల్లో వాటాలు ఉన్నాయి ప్రైవేట్ విమానాలు, కంపెనీలో వాటాలు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావా అని నిలదీశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అబద్దాలకు మారుపేరంటూ ఎద్దేవా చేశారు. 

ఐటీ అభివృద్ధి పేరుతో తెలంగాణను మెుత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుందని దుయ్యబుట్టారు. అక్రమాస్తుల కోసం రంగులు మార్చుకుంటూ మాటలు మారుస్తూ పబ్బం గడుపుతున్నారంటూ విమర్శించారు. ఓటమి కళ్లముందు కనిపిస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి లాగులు తడుస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ప్రేమలో కేసీఆర్ గుడ్డివాడు అయ్యాడంటూ తిట్టిపోశారు. 

ఆంధ్రా ప్రజలకు అండగా ఉంటానంటున్న కేటీఆర్ గతంలో కేసీఆర్ ఆంధ్రావాళ్లని తిట్టిన తిట్లు గుర్తుకు లేదా అని నిలదీశారు. నీ జివితంలో ఏనాడైనా నిజం మాట్లాడావా అని ప్రశ్నించారు. మూసీనదికంటే దారుణమైన కంపు కొడుతుంది నీ నోరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు మధుయాష్కీ.  

గతంలో కలియుగంలో రాక్షసుడు ఉంటే వాడు ఆంధ్రాలోనే పుడతారంటూ ఆంధ్రుల మనోభవాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లు రాక్షసులు అంటూ తిట్టలేదా, తెలంగాణ ప్రజల రక్తం పీల్చుకుని తినండి అంటూ శాపనార్థాలు పెట్టలేదా అని నిలదీశారు. 
   
ఛీ..అన్నా తూ అని ఊసినా సిగ్గు శరం లేకుండా ఆంధ్రోళ్లు వెళ్లడం లేదంటూ అత్యంత నీచంగా మాట్లాడిన మాటలు గుర్తుకు రావడం లేదా అన్నారు. ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని తిట్టింది కేసీఆర్ అని గుర్తు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాస్ట్ స్కీం ద్వారా ఆంధ్రప్రజలకు తీరని నష్టం చేసింది కేసీఆర్ ప్రభుత్వమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పేద ప్రజలకు రీయింబర్స్ మెంట్ రాకుండా కాస్ట్ స్కీంను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.  

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రోళ్ల కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే కంటితో తీస్తానన్న కేటీఆర్ ఎన్నికలు పూర్తైన తర్వాత ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడు ఆతిథ్యం స్వీకరించింది కేసీఆర్ కాదా అని అన్నారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబేనని ఆరోపించిన మీరు ఇప్పుడు మాటమారుస్తున్నారని నిలదీశారు. 

తీరా ఎన్నికలు పూర్తయ్యాక మాటమార్చి ఆంధ్రప్రజలను తిట్టడం మెుదలు పెట్టలేదా అని నిలదీశారు. అంధితే కాళ్లు అందకపోతే జుట్టు అన్న రీతిలో కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రావాళ్లకు అండగా ఉంటానన్న కేటీఆర్ ఎన్నికలు పూర్తయ్యాక వాళ్లను తిట్టడం మెుదలుపెడతారని ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios