హైదరాబాద్: ఎఐసీసీ నిర్ణయం తీసుకొనే వరకు పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా స్పష్టం చేశారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా కూడ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టిక్కెట్టు కోసం రాజగోపాల్ రెడ్డి ఎందుకు వచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

గెలిచిన తర్వాత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏదైనా చెప్పాలనుకొంటే  నేరుగా రాహుల్‌గాంధీతో చెప్పాలని  ఆయన  సూచించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారో  ప్రజలకు తెలుసునని ఆయన అభిప్రాయపడ్డారు.

 పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలని  ఆయన సూచించారు. పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయంలో ఎఐసీసీ నిర్ణయం తీసుకొనే వరకు  ఉత్తమ్‌ కొనసాగుతారని చెప్పారు.