Asianet News Telugu

నా ఆరోపణలు తప్పయితే.. హుజురాబాద్ చౌరస్తాలో ఉరేయండి: ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్

ఈటల ఆరోపణలకు కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాని తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు

congress leader koushik reddy challenge to etela rajender ksp
Author
Hyderabad, First Published Jun 12, 2021, 4:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఈటల ఆరోపణలకు కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాని తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈటల ఫ్రస్ట్రేషన్‌లో వున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు అమరవీరుల స్థూపం దగ్గకు ఎందుకు పోలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

ఒక్క అమరవీరుల కుటుంబాన్ని అయినా ఈటల పరామర్శించారా అని నిలదీశారు. తాను చేసిన ఆరోపణల్లో తప్పుంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా వున్నట్లు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. రెండెకరాల భూమి వున్న ఈటలకు.. 700 ఎకరాల స్థలం ఎక్కడదని ప్రశ్నించారు. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 3 వేల ఎకరాలను ఈటల కొన్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

Also Read:కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టడమే ఎజెండా: రాజీనామాకు ముందు ఈటల రాజేందర్

హుజురాబాద్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని.. తాను చెప్పినది అబద్ధమైతే అంబేద్కర్ చౌరస్తా ఎదుట ఉరి తీయాలని కోరారు. తనకు 200 ఎకరాలు వున్నాయని చెప్పిన ఈటల 2018 ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం.. 69 ఎకరాలు వున్నాయని చూపించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నానక్‌రామ్ గూడలో రామానాయుడు స్టూడియో పక్కన 15 ఎకరాలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios