బీఆర్ఎస్‌కు అనుకూల వైఖరి.. ఆ పోలీస్ అధికారులను బదిలీ చేయండి : ఈసీకి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నేత, కొల్లాపూర్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు కలిశారు. చాలా మంది పోలీసు అధికారులు కొల్లాపూర్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్నారని.. వారిని తక్షణం బదిలీ చేయాలని ఆయన వికాస్‌ రాజ్‌ను కోరారు.

congress leader jupally krishna rao meets telangana ceo vikas raj ksp

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నేత, కొల్లాపూర్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు కలిశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌లో కొందరు పోలీసు అధికారులు .. అధికార బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై సదరు అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని కృష్ణారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా మంది పోలీసు అధికారులు కొల్లాపూర్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్నారని.. వారిని తక్షణం బదిలీ చేయాలని ఆయన వికాస్‌ రాజ్‌ను కోరారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు నడుచుకుంటున్నారని.. వారిపై ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని కృష్ణారావు ఫిర్యాదులో తెలిపారు. 

ALso Read: కాంగ్రెస్ పై కేసీఆర్ అంచనాలు తలకిందులు? హస్తానికి పార్టీల మద్దతు పెరగడంతో బీఆర్ఎస్‌లో ఆందోళన!

మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అభ్యర్ధులు , ఆ పార్టీ మద్ధతుదారుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం ప్రారంభమైన దాడులు.. ఇవాళ కూడా కొనసాగాయి. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఇంటిపైనా దాడులు జరగడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా వుందని అందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే ఈ దాడులు నిర్వహిస్తున్నారని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయడం కోసం ఐటీ దాడులు చేయిస్తున్నారని.. కానీ తాము మాత్రం చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామని జానారెడ్డి స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios