కేసీఆర్ పై జానారెడ్డి సీరియస్ విమర్శలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 7, Sep 2018, 1:01 PM IST
congress leader janareddy fire on KCR
Highlights

గాంధీ కుటుంబంపై కేసీఆర్‌ వ్యాఖ్యలు కుసంస్కారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలే అద్భుతమని... చేతల్లో ఏమీ ఉండదని ఆయన అన్నారు.

తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శల వర్షం కురిపించారు.  కేసీఆర్ నోటి వెంట వచ్చే మాటలు అద్భుతంగా ఉంటాయని.. కానీ చేతలు వచ్చే సరికి ఏమీ చేయరని జానా రెడ్డి విమర్శించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ అనిశ్చితితోనే ముందస్తుకు వెళ్తున్నామని కేసీఆర్‌ చెప్పారని...అయితే అనిశ్చితి అంటే ప్రతిపక్షం ఉండకూడదా?...ప్రజలు ప్రశ్నించకూడదా? అని ఆయన నిలదీశారు. గాంధీ కుటుంబంపై కేసీఆర్‌ వ్యాఖ్యలు కుసంస్కారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలే అద్భుతమని... చేతల్లో ఏమీ ఉండదని ఆయన అన్నారు. 2018 నాటికి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారని...ఇప్పటి వరకు పవర్ ప్లాంట్‌ పునాదులు కూడా తీయలేదని జానారెడ్డి దుయ్యబట్టారు.

loader